Pahalgam attack : Pakistan does not have the strength to withstand Indian missiles. భారత మిస్సైల్స్ శక్తికి పాక్ నిలవలేదు
Pahalgam attack : Pakistan does not have the strength to withstand Indian missiles. భారత మిస్సైల్స్ శక్తికి పాక్ నిలవలేదు
Pahalgam attack : భారత్ సర్వ మతాల సమ్మేళనం. లౌకిక దేశానికి, ప్రజాస్వామ్య ప్రతిరూపానికి ప్రపంచానికి దిక్సూచి. అలాంటి దేశానికి పాకిస్తాన్ దేశంతో ఆదినుంచి శత్రుత్వం గా ఉంటోంది. దీనికి తోడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు బారత దేశంలో చొరబడి పాల్పడుతున్న చర్యలు భారత దేశ సహనాన్ని పరీక్షిస్తున్నదని చెప్పవచ్చు. గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం దేశ ప్రజలకు ఆవేధను మిగిల్చింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడినా తీరు పై యావత్ ప్రపంచం ఖండించింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో భారత్ – పాక్ మధ్య యుద్దం తప్పుదు అన్న విషయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏప్రిల్
22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గావ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26
మంది పర్యాటకులు మరణించడంతో భారత్-పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయి. ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే
సంస్థ బాధ్యత వహించగా, ఇది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా
అనుబంధంగా భారత ప్రభుత్వం పేర్కొంది .
Pahalgam attack : భారత దేశ ఘాటైన స్పందన :
భారత
ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని "యుద్ధ చర్య"గా పేర్కొని, ఉగ్రవాద
శిబిరాలను నిర్మూలించేందుకు, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు
వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది:
- పాకిస్తాన్‌కు చెందిన పౌరులకు వీసాలు
నిలిపివేయడం.
- పాకిస్తాన్ దౌత్యవేత్తలను దేశం నుండి
వెనక్కి పంపడం.
- ఇండస్ (సింధూ నది) వాటర్ ట్రీటీని
సస్పెండ్ చేయడం.
- పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని
మూసివేయడం .
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం
జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో
రుబియోతో మాట్లాడి, దాడికి బాధ్యులైన వారిని న్యాయ
విచారణకు తీసుకురావాలని కోరారు .
Pahalgam attack : పాకిస్తాన్ ప్రతిస్పందన
పాకిస్తాన్ ఈ దాడిలో తమ ప్రమేయం లేదని బుకాయింపు మాటలను వ్యక్తం చేస్తోంది. అయితే, తమ దేశం పై భారత్ దాడులు నిర్వహించే విశ్వసనీయ సమాచారం ఉందని, తమ దేశం పై దాడి జరిగితే ఘాటుగా జవాబు ఇస్తామని పాక్ హెచ్చరించింది . ఇందుకు తగ్గట్లు పాక్ కొన్ని నిర్ణయాలను ప్రకటించింది.
శిమ్లా
ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం.
- భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడం.
- భారత రాయబారులను వెనక్కి పంపడం.
- వాణిజ్య సంబంధాలను నిలిపివేయడం .
Pahalgam attack : సరిహద్దు ఉద్రిక్తతలు
ఏప్రిల్ 24 నుండి
లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద రెండు దేశాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బీఎస్ఎఫ్ సైనికుడు ఒకరు
పాకిస్తాన్ రేంజర్లచే పట్టుబడినట్లు సమాచారం. పాకిస్తాన్ రెండు భారత డ్రోన్లను
కూల్చివేసినట్లు పేర్కొంది .
అంతర్జాతీయ స్పందన
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో
రుబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మరియు
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో మాట్లాడి, ఉద్రిక్తతలను
తగ్గించేందుకు పిలుపునిచ్చారు . అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, భారత
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు
మద్దతు ప్రకటించారు.
Pahalgam attack : యుద్ధం సంకేతాలు :
భారత్ – పాక్ యుద్ధం అనివార్యం అనే సంకేతాలు
ప్రస్పుతమువుతున్న వేల భారత్ ఇందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు
తగిన నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను రక్షణ శాఖకు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోది
తెలపడం ఇందుకు సంకేతంగా భావించవచ్చు.
ఓ వేల భరత్ – పాక్ యుద్ధం అనివార్యం
అయితే భారత్ దగ్గర విశేష మిస్సైల్స్ బలం వుంది. వీటి దాటికి తట్టుకుని నిలబడే
శక్తీ పాక్ కు లేకున్నా, ఇప్పటికే ఆర్ధిక అవస్థలు పడుతున్న, బలహీన సైన్యంతో వున్న పాకిస్తాన్
మాత్రం మేకపోతు గాంబీరం ప్రదర్శిస్తోంది.
ప్రథ్వి అనేది భారత్
అభివృద్ధి చేసిన మొదటి బాలిస్టిక్ మిస్సైల్. ఇది పర్యావరణ అనుకూలమైన ద్రవ ఇంధనంతో
నడిచే మిస్సైల్.
- ప్రథ్వి-I : సైన్యం కోసం (రేంజ్: 150 కిమీ).
- ప్రథ్వి-II : వాయుసేన కోసం (రేంజ్: 250 కిమీ).
- ప్రథ్వి-III / Dhanush
: నౌకాదళం కోసం (నౌకలపై నుంచి
ప్రయోగించగలిగే మిస్సైల్).
ఈ మిస్సైల్ తక్కువ దూరం ఉన్న టార్గెట్లపై
అత్యంత ఖచ్చితంగా దాడి చేసి ధ్వంసం చేయగలదు.
2.
అగ్ని మిస్సైల్ (Agni Missile)
అగ్ని మిస్సైళ్ల శ్రేణి
భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన మరియు దీర్ఘదూర బాలిస్టిక్ మిస్సైళ్లలో ఇది ఒకటి.
ప్రధానంగా అణ్వాయుధాలను మోయగలవిగా రూపొందించబడ్డాయి.
- అగ్ని-I:
700-900 కిమీ పరిధి.
- అగ్ని-II:
2,000-3,000 కిమీ.
- అగ్ని-III:
3,500-5,000 కిమీ.
- అగ్ని-IV: అధునాతన నావిగేషన్‌తో 4,000
కిమీ.
- అగ్ని-V: అంతర్జాతీయ స్థాయిలో 5,500 కిమీ
పైగా పరిధి – ICBM శ్రేణిలోకి వస్తుంది.
- అగ్ని-VI (ఉన్నత అభివృద్ధిలో): 8,000-10,000
కిమీ పరిధి, మల్టిపుల్ వార్‌హెడ్. సామర్థ్యం (MIRV).
ఈ మిస్సైళ్లు భారత అణ్వాయుధ ప్రతిఘాత
సామర్థ్యానికి చిహ్నం.
3.
ఆకాశ్ మిస్సైల్ (Akash Missile)
ఆకాశ్ అనేది మిడియం రేంజ్
సర్ఫెస్-టు-ఎయిర్ మిస్సైల్ (SAM). ఇది విమానాలు, హెలికాప్టర్లు మరియు క్రూయిజ్ మిస్సైళ్లను గమ్యం చేస్తుంది.
- పరిధి: సుమారు
30-50 కిమీ.
- వేగం: సబ్‌సోనిక్
నుండి సూపర్‌సోనిక్ వరకు.
- దారితీసే విధానం: రాడార్
గైడెడ్.
- ప్రయోగ వేదికలు: భూమి
లేదా మొబైల్ లాంచర్.
ఆకాశ్-NG (నెక్ట్స్
జనరేషన్) మోడల్ ప్రస్తుత అభివృద్ధిలో ఉంది, దీని పరిధి మరియు
ఖచ్చితత్వం మరింత మెరుగైనది.
4.
త్రిశూల్ మిస్సైల్ (Trishul
Missile)
త్రిశూల్ మిస్సైల్ తక్కువ
పరిధి గల సర్ఫెస్-టు-ఎయిర్ మిస్సైల్. ఇది DRDO
అభివృద్ధి చేసింది.
- పరిధి: 9 కిమీ.
- ఉద్దేశ్యం: తక్కువ
ఎత్తులో ప్రయాణించే విమానాలు మరియు హెలికాప్టర్లు.
5.
నాగ్ మిస్సైల్ (Nag Missile)
నాగ్ మిస్సైల్ ట్యాంకులు
వంటి బలమైన భూమి లక్ష్యాలను నాశనం చేయడానికి రూపొందించబడిన అ్యాంటీ ట్యాంక్
గైడెడ్ మిస్సైల్ (ATGM).
- పరిధి: 500 మీటర్లు
నుండి 4 కిమీ వరకు.
- దారితీసే విధానం: హీట్
సీకింగ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్.
- వేరియంట్లు:
- హెలీనా (HELINA)
– హెలికాప్టర్ల నుండి ప్రయోగించగలవు.
- నామిక (NAMICA)
– మొబైల్ లాంచర్ వాహనం.
"ఫైర్ అండ్ ఫోర్జెట్" విధానం
కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
6.
బ్రహ్మోస్ మిస్సైల్ (BrahMos Missile)
బ్రహ్మోస్ అనేది భారత్-రష్యా
సంయుక్త అభివృద్ధి మిస్సైల్. ఇది అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్
క్రూయిజ్ మిస్సైల్.
- పరిధి: ప్రస్తుతం
450-800 కిమీ (కొత్త వెర్షన్లు 1500
కిమీ వరకు ఉన్నాయి).
- వేగం: మాక్
2.8-3.0.
- వేరియంట్లు:
- బ్రహ్మోస్-ఎయిర్ లాంచ్డ్ (Su-30 MKI నుండి
ప్రయోగం)
- బ్రహ్మోస్ నేవల్ వెర్షన్
- బ్రహ్మోస్ ల్యాండ్ అటాక్ వెర్షన్
భవిష్యత్తులో బ్రహ్మోస్-II (హైపర్సోనిక్) రూపకల్పనలో ఉంది,
ఇది మాక్ 7 వేగంతో
ప్రయాణించగలదు.
7.
షౌర్య మిస్సైల్ (Shaurya Missile)
షౌర్య అనేది సాలిడ్
ఫ్యూయెల్‌తో నడిచే బాలిస్టిక్ మిస్సైల్,
ఇది సబ్‌మెరైన్ లాంచ్ మిస్సైల్ రూపంలో
అభివృద్ధి చేయబడింది.
- పరిధి: సుమారు
750-2000 కిమీ
- వేగం: హైపర్సోనిక్
- ప్రయోజనం: త్వరితగతిన
లక్ష్యాన్ని చేరుకోవడం, తక్కువ ఎత్తులో ప్రయాణించి శత్రు
రాడార్‌లను తప్పించగలగడం దీని ప్రత్యేకత.
8.
కే-శ్రేణి మిస్సైళ్లు (K-Series Missiles)
ఇవి భారత నౌకాదళం కోసం రూపొందించిన సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైళ్లు (SLBMs). ఈ శ్రేణిలో మిస్ైళ్లను
అరిహంత్ క్లాస్ అణు సబ్‌మెరిన్ల నుండి ప్రయోగిస్తారు.
- కే-15 (Sagarika)
– 750 కిమీ పరిధి.
- కే-4 –
3,500 కిమీ పరిధి.
- కే-5 & కే-6 – అభివృద్ధిలో ఉన్నవి, 5,000 కిమీ
పైగా పరిధి కలిగి ఉంటాయి.
ఇవి భారత న్యూక్లియర్ ట్రైయాడ్ లో ఒక కీలకమైనవి.
9.
స్మార్ట్ మిస్సైల్ టార్పెడో (SMART)
ఇది DRDO
అభివృద్ధి చేసిన టార్పెడో డెలివరీ
సిస్టమ్, ఇది యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కోసం ఉపయోగిస్తారు.
- ఇది సముద్రంపై నుంచి ప్రయోగించగల
మిస్సైల్ రూపంలో ఉంటుంది
- టార్పెడోను పొడవైన దూరానికి
తీసుకెళ్లి నీటిలో విడదీసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది
10.
అస్త్ర మిస్సైల్ (Astra Missile)
అస్త్ర అనేది భారతదేశపు తొలి
స్వదేశీ ఎయిర్-టు-ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్ (BVRAAM).
- పరిధి: 80-110 కిమీ
- వేగం: మాక్
4.5
- ప్లాట్‌ఫారమ్స్: Su-30 MKI, LCA Tejas
అస్త్ర Mk-II
మరియు Mk-III
రూపకల్పనలో ఉన్నాయి, ఇవి మరింత అధిక పరిధి
కలిగి ఉంటాయి.
భారతదేశం మిస్సైల్ రంగంలో స్వయం సమృద్ధి
సాధించి, ప్రపంచంలో స్వతంత్ర అణుశక్తిగా నిలిచింది. ప్రతి మిస్సైల్ తరం
భారత రక్షణ శక్తిని బలోపేతం చేసింది. మిస్సైళ్ల అభివృద్ధిలో DRDO, HAL, ISRO, BDL వంటి
సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారత మిస్సైల్ ముందు నిలవగలగడం
పాకిస్తాన్ కు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కాని ఇలాంటి పరిస్థితిలో మేకపోతు గాంబీర్య
ప్రకటనలు చేయటం ఆ దేశానికే చెల్లింది.
సేకరణ,
రచన : Galithotti
Venkateswarlu.
సహాయన్యూస్,
email : 777sahaya@gmail.com.

కామెంట్‌లు